UPDATED 15th APRIL 2022 FRIDAY 08:00 PM
Summer Holidays : ఏపీలో స్కూల్ విద్యార్థుల వేసవి సెలవులకు సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యా శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం జులై 4వ తేదీ నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది.
కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 27 నుంచి మే 9 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ పరీక్షలు పూర్తి కాగానే వారికి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల అనంతరం జూలై 4 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇక జూనియర్ కాలేజీలకు మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి.
ఈసారి మార్చి నెల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండల తీవ్రత కారణంగా ఇప్పటికే ఒంటిపూట బడులు నిర్వహిస్తోంది ప్రభుత్వం