శాకంబరీదేవి అలంకారంలో బాలాత్రిపుర సుందరీదేవి

UPDATED 10th AUGUST 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయంలో ఆషాడ మాసం పురస్కరించుకుని శాకంబరీదేవి అలంకారంలో కొలువైన బాలాత్రిపుర సుందరి అమ్మవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకుని ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఆలయ ఈవో పులి నారాయణమూర్తి, వేదపండితులు మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణకుంభంతో, మంగళవాయిద్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చైర్మన్ శాలువా కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఆషాడమాసంలో అమ్మవారిని  వివిధ రకాల కూరగాయలతో అలంకరించి శాకంబరీదేవిగా భక్తులు పూజించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, బి. సాయిబాబా, మన్యం చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us