వచ్చే ఎన్నికలలో జనసేన విజయం తథ్యం

UPDATED 5th MARCH 2018 MONDAY 9:00 PM

కాకినాడ: కష్టపడే కార్యకర్తలకు జనసేన పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య పేర్కొన్నారు. స్థానిక పద్మనాభ ఫంక్షన్ హాల్ లో జనసేన కార్యకర్తలతో సోమవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ జనసేన కార్యకర్తలతో రాఘవయ్య మాట్లాడుతూ ముఖ్యమైన సందేశాలను పార్టీ కార్యకర్తలకి తెలియజేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఇటువంటి రాజకీయాలు పోవాలి అంటే నిజాయితీగా ఉన్న పార్టీ  ప్రజల ముందుకు రావాలన్నారు. ఈ నెల14 తేదీన పార్టీ దిశా నిర్దేశాలు మన నాయకుడు ప్రవేశపెట్టడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనలు పాటించాలన్నారు. ఇప్పటి వరకు ఎవరికి పార్టీలో పదవులు కేటాయించలేదని, పార్టీ పదవులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎవరు పట్టించుకోవద్దన్నారు. కష్టపడి పనిచేసిన వ్యక్తిని ఎప్పుడూ పార్టీ మోసం చేయదని అన్నారు. గుంటూరులో జరుగుతున్న సమావేశం చాలా కీలకం అని ప్రతి ఒక్కరూ రావాలని ఆయన ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తుమ్మల రామస్వామి (బాబు), దొమ్మేటి వాసు, అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us