పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ దీక్షలు

గంగవరం,21 మే 2020 ( రెడ్ బీ న్యూస్): కరోనా కష్టకాలంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన దీక్షలకు దిగాయి. టీడీపీ మాజీ ఎంపిపి డాక్టర్ తీగల ప్రభ ఆధ్వర్యంలో గురువారం ఆమె స్వగృహంలో నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఓవైపు లాక్ డౌన్‌తో ఉపాధిలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కొత్త శ్లాబ్ విధానంతో అధిక బిల్లులువేసి ప్రజలకు ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. లాక్ డౌన్ కాలంలో కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని, పాత శ్లాబ్ విధానాన్నే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి సారపు సత్యవేణి, మాజీ ఎంపీటీసీ కోసు బుల్లియమ్మ ,సీనియర్ నాయకురాలు సారపు బాలమ్మ ,తెలుగు యువత అధ్యక్షుడు మద్దేటి వీరభద్రారెడ్డి (బద్రి), కొమ్మన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us