UPDATED 13th MARCH 2022 SUNDAY 02:00 PM
Five People Killed Jaggaiahpet : తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందుకు నిర్లక్ష్యం, అతివేగంగా, పరిమితికి మించి ప్రయాణం చేయడం తదితర కారణాలతో నిండు జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. శుభకార్యం, అశుభ కార్యం ఇలా పలు వేడుకలకు వెళుతూ.. ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజగా.. ఏపీలో జరిగిన ఓ ఆక్సిడెంట్…కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఓ కారు కల్వర్టును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఇందులో ఐదు నెలల గర్భవతితో పాటు చిన్నారి ఉండడం అందర్నీ కంటతడిపెట్టింది. ఈ ఘటన జగ్గయ్యపేట మండలం వద్ద చోటు చేసుకుంది. వీరంతా అన్నప్రాసన నిమిత్తం వెళ్లారు.
జీహెచ్ఎంసీలో పని చేస్తున్న జోజి తన మేనకోడలు ప్రిన్సి అన్నప్రసాన జరుగుతోంది. దీంతో ఈ కార్యక్రమానికి వెళ్లాలని జోజి కుటుంబసభ్యులు నిర్ణయించారు. అనంతరం వీరు TS 07JB 1940 కారులో బయలుదేరారు. ఏలూరులో అన్నప్రసాన జరుగుతోంది. గౌరవరం వద్ద జాతీయ రహదారిపై వేగంతో ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొంది.
దీంతో కారు తుక్కుతుక్కైంది. కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు వదిలారు. మృతి చెందిన వారిలో పాప ప్రిన్సి, తాత కుటుంబరావు, తల్లి శాంతి, మేనత్త ఇందిర చనిపోయారు. ఇందిర ఐదు నెలల గర్భవతి. నానమ్మ మేరీకి తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో మేరి కూడా చనిపోయింది. మేనమామ జోషి పరిస్థితి సీరియస్ గా ఉంది. దీంతో అతడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ వారు చనిపోయారన్న విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.