UPDATED 8th JULY 2017 SATURDAY 6:30 PM
తండ్రి జీవిత కథా చిత్రంలో తాను కథానాయకుడిగా నటిస్తూ సినిమా తీస్తానని బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో సినిమా అనే సరికి అందరు ఒక్క సారిగా షాక్ అయ్యారు. నటుడిగా, రాజకీయ వేత్తగా, మంచి మానవత్వం ఉన్న మనిషిగా ఎందరో హృదయాలలో గుడి కట్టుకున్న ఎన్టీఆర్ జీవితగాధని తెరపై ఎలా చూపిస్తారు అనే దానిపై చాలా చర్చలు జరిగాయి. ఈ మధ్య ఎన్టీఆర్ బయోపిక్ ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తాడని ప్రచారం జరిగింది. కట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు బిగ్ బాస్ తెలుగు షో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సంబంధించి పలు విషయాలు తెలియజేశాడు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధి సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గురించి అడిగిన ప్రశ్నకి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఎన్టీఆర్ పై బయోపిక్ ని నేను తప్పక స్వాగతిస్తాను . ఆయన ఒక నటుడు, ఒక పొలిటికల్ లీడర్, ఒక ఫ్యామిలీకి సంబంధించిన వారు కాదు. తెలుగు ప్రజలు అందరి గుండెల్లో దేవుడిగా కొలవబడ్డారు. ఆయన గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. ఎన్టీఆర్ బయోపిక్ ని తప్పక స్వాగతిస్తాను. ఇక ఎన్టీఆర్ పాత్రని బాలయ్య చేస్తున్నాడు అనే దానిపై కామెంట్ ఏంటి అంటే.. బాబాయ్ నటిస్తే అది బ్రహ్మండమే అని అన్నారట జూనియర్ ఎన్టీఆర్. తాతగారు నందమూరి తారక రామారావు జీవితగాథతో వచ్చే సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాబాయ్ బాలకృష్ణను చూడాలని కోరుకుంటున్నా. నేను ఎంతో ఆత్రంగా వెయిట్ చేస్తున్నా. ఆ సినిమాలో నేనేదైనా పాత్ర పోషించే ఐడియా ప్రస్తుతానికైతే లేదు అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు.