1048 లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయింపు

UPDATED 17th NOVEMBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: పట్టణంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగు ఫేజ్-1 క్రింద 1048 లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శనివారం స్థానిక జగ్గమ్మగారి పేటలో 416 ప్లాట్లు, ఉప్పువారి సత్రం 632 ప్లాట్లుకు సంబంధించిన    కేటాయింపులు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సమక్షంలో లబ్ధిదారులు అనంతలక్ష్మి, వి. నళినీశ్రీతో మొదటిగా రూ.లక్ష రూపాయల కేటగిరి-సి ప్లాట్లుకు సంబంధించి లాటరీ పద్దతిలో ప్లాట్లు కేటాయింపు రసీదులు చినరాజప్ప తీయించడం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ అధికారులు, రాజకీయ ప్రతినిధులు ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా కేటాయింపులు జరుగుతాయని, రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల నిరుపేదలకు సొంత ఇంటికల నిజం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశ్యమని అన్నారు. ఈ ప్లాట్లులో విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందించడం జరుగుతుందని, ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టు క్రింద రూ.78.72 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరరావు, టిడ్కో ఇన్ చార్జి వి.సి.ఎల్. హెచ్. అప్పలనాయుడు, బ్యాంకు ఆర్గనైజర్ శివప్రసాద్, హౌసింగు ఎఇ ఎల్. శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్లు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us