TTD: 3.79 లక్షలమందికి వైకుంఠ ద్వారదర్శనం

Updated 24 January 2022 Monday 05:00 AM

తిరుమల (రెడ్ బీ న్యూస్) : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈనెల 13 నుంచి 22 వరకు 3.79 లక్షల మంది భక్తులకు శ్రీవారి, వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వెనుకబడిన వర్గాల నుంచి 6,949 మంది, అలిపిరి నడకమార్గంలో 26,240 మంది, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం ద్వారా 1.66లక్షల మంది, సర్వదర్శనం టైమ్ స్లాట్ ద్వారా 88వేల మంది, శ్రీవాణి ట్రస్టు ద్వారా 15,465 మంది, దాతలు 1,917 మంది, వర్చువల్ సేవా టికెట్ల ద్వారా 43,250 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు 4 లక్షల లడ్డూలను అందించారు. హుండీ కానుకలు రూ.26.61 కోట్లు లభించాయి. పదిరోజులకు 42,809 గదులను భక్తులకు కేటాయించగా రూ.4.68 కోట్ల ఆదాయం లభించింది. శ్రీవారికి 1.23 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆలయంలో చేపట్టిన పుష్పాలంకరణకు దాతల నుంచి 31 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 3. 5 లక్షల కట్ ఫ్లవర్లు వినియోగించారు. రూ.1.30 కోట్లతో మరమ్మతులు పూర్తి భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలను యుద్ధప్రాతిపదికన రూ.1.30 కోట్లతో మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తితిదే తెలిపింది. శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.60 కోట్లతో నడకమార్గం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని పేర్కొంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us