Amaravati : రాజధాని ప్రాంత రైతులకు CRDA లేఖలు

UPDATED 20th MARCH 2022 SUNDAY 07:00 AM

CRDA Letters : ఏపీ రాజధాని రైతులకు సీఆర్డీఏ లేఖలు రాసింది. తుళ్లూరు రాజధానికి ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన రైతులు తిరిగి పొందిన ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ అధికారులు లేఖలు జారీ చేశారు. ఇంటింటికి తిరిగి రైతులకు సీఆర్డీఏ సిబ్బంది లేఖలను అందజేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లను దాదాపు 65 శాతం రిజిస్ట్రేషన్లను చేసింది సీఆర్డీఏ. వాటికి హద్దురాళ్లను కూడా వేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి పనులు నిలిపివేయడంతో పాటు.. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లను కూడా ఆపేసింది.రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి.. మూడు నెలల్లో అప్పచెప్పమని హైకోర్టు జడ్జిమెంట్‌ ఇవ్వడంతో.,. సీఆర్డీఏ అధికారుల్లో చలనం వచ్చింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్‌ చేయించుకోని వారు చేసుకోవాలని.. ఏపీ సీఆర్డీఏ వెబ్‌ సైట్‌లో మూడు రోజులు ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని లేఖలలో పేర్కొన్నారు అధికారులు.

 

రాజధాని రైతుల దగ్గర ఉన్న.. ఒరిజినల్‌ భూమి పత్రాలను అందజేసి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు సీఆర్‌డీఏ అధికారులు. ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిందిగా.. కాంపిటెంట్‌ అథారిటీ అండ్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పేరు మీద లేఖలు జారీ చేశారు. ఈ విసయంలో ఏవైనా సందేహాలు ఉంటే.. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దుపై దాఖలైన 75 పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. అమరావతి నుంచి ఆఫీసులను తరలించకూడదని స్పష్టం చేసింది. భూములను ప్రభుత్వానికిచ్చిన రైతులు, వాటాదారులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని సర్కారుకు తేల్చి చెప్పింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు ఆ భూములను తాకట్టు పెట్టరాదని స్పష్టం చేసింది. అమరావతి రాజధానిపై పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లకు ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున చెల్లించాల్సిందిగా సర్కారును కోర్టు ఆదేశించింది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us