లబ్ధిదారునికి లోన్ చెక్ పంపిణి

UPDATED 11th APRIL 2018 WEDNESDAY 9:00 PM

రాజమహేంద్రవరం: ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారికి అందించే ఆర్ధిక సహాయంతో అభివృద్ధి చెంది సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ అన్నారు. బిసి కార్పొరేషన్ ద్వారా ఋణం పొందిన లబ్ధిదారుడు పసుపురెడ్డి గోవింద్ కు రూ. రెండు లక్షలు చెక్ ను బుధవారం ఆయన అందచేశారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్యాంకులు ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులు తమ రుణాలను సకాలంలో చెల్లిస్తే మరలా మరింత ఎక్కువ ఆర్ధిక సహాయం పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. లబ్ధిదారులు ఈ మొత్తాన్ని దుర్వినియోగం చేయకుండా చక్కగా వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, అయ్యల గోపి, నాళం పద్మశ్రీ, సందక లక్ష్మి, తంగుడు వెంకట్రావు, హీరాచంద్ జైన్, పిసిని కృష్ణ, రుత్తల చిన్ని, ఎస్.వి.రాణి, తంగెళ్ల రాజ్యలక్ష్మి, బమ్మి తులసి, సత్యశ్రీ, వేణు, అవినాష్, రొక్కం ఉమ, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us