EPFO: పీఎఫ్‌ చందాదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ-నామినేష‌న్ చివరి తేదీ పొడిగింపు

రెడ్ బీ న్యూస్, 20 డిసెంబర్ 2021: ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌. ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త చేయాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ, ఈపీఎఫ్ఓ పోర్ట‌ల్ సర్వర్ డౌన్ అవ్వ‌డం స‌మ‌స్య‌గా మారింది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు వినియోగ‌దారులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్‌ 31 తర్వాత కూడా నామినీ వివరాలను అప్‌డేట్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఈపీఎఫ్‌వో ఒక ట్వీట్ చేసింది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us