ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేన సిద్ధం

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 16 నవంబర్ 2021 : పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో 25వ పోలింగ్ బూత్ ఎంపీటీసీ ఎన్నిక రీపొలింగ్ నిలుపుదల చేయడంపై జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి (బాబు) అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక విలేఖరులతో ఆయన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంగళవారం మాట్లాడారు. కౌంటింగ్ రోజు జనసేన అభ్యర్థికి 100 ఓట్లకు పైగా మెజారిటీ వచ్చిందని చెప్పిన అధికారులు ధ్రువీకరణ పత్రం మాత్రం ఇవ్వలేదన్నారు. పోలైన ఓట్లలో కొన్నింటికి చెదలు పట్టడంతో రిటర్నింగ్ అధికారి ఆదేశాల తర్వాత ధ్రువీకరణ పత్రం ఇస్తామని మభ్యపెట్టారని విమర్శించారు.ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. పులిమేరు గ్రామంలోని 25వ నంబర్ బూత్ లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందని, తర్వాత మూడు బూత్ లలో పోలింగ్ నిర్వహించాలని రెండవసారి నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. రెండవసారి విడుదల చేసిన నోటిఫికేషన్ పై జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. తదనుగుణంగా రెండవసారి విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఎన్నికల కమిషన్ మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 25వ పోలింగ్ బూత్ లో పోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు బూతుల్లో పోలింగ్ నిర్వహించాల్సి వస్తే మండలం మొత్తం జెడ్పీటీసీ అభ్యర్థికి పోలింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us