TS News: భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా తెప్పోత్సవం

భద్రాచలం (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : భద్రాచలం రామాలయంలో బుధవారం సాయంత్రం తెప్పోత్సవం వైభవంగా జరిగింది. భక్త రామదాసు కాలం నుంచి పవిత్ర గోదావరిలో ఈ ఉత్సవం చేస్తున్నారు. ముక్కోటి ఉత్సవాల్లో వైకుంఠ ఏకాదశికి ముందు రోజు సాయంత్రం దీన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి కరోనా ఆంక్షల నేపథ్యంలో గోదావరిలో ఈ వేడుక చేయలేదు. బేడా మండపం సమీపంలోని పుష్కరిణిలో స్వామి వారి తెప్పోత్సవం నిర్వహించారు. కొవిడ్ నిబంధనల మేరకు భక్తులను అనుమతించకుండా నిరాడంబరంగా వేడుకలు చేశారు. గోదావరి నుంచి తీర్థబిందెలు తీసుకొచ్చి సంప్రోక్షణ చేశారు. స్వామి, అమ్మవారి విగ్రహాలను మేళతాళాల మధ్య ప్రధాన ఆలయం నుంచి మండపానికి తీసుకువచ్చారు. అనంతరం రాములోరిని హంసవాహనం పై ఉంచి తెప్పోత్సవ పూజలు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us