అక్రమ అరెస్టులు దురదృష్టకరం

* పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప 

UPDATED 17th DECEMBER 2020 THURSDAY 8:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): తొండంగి మండలం కొత్తపాకాల గ్రామం వద్ద దివిస్ కర్మాగార నిర్మాణం నిలుపుదల చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలుకుతున్న వారిని అక్రమ అరెస్టులు చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. స్థానిక విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ వారి న్యాయమైన కోరికలు ప్రభుత్వం ఆమోదించి శాంతిభద్రతలను కాపాడాలని, అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. దివిస్ నిర్మాణం కొనసాగితే రైతులు ముఖ్యంగా మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోవడమే కాకుండా తమ ఉనికిని కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us