ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి

ఆర్డీవో వెంకటరమణ

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 26 ఆక్టోబర్ 2021: కోవిడ్ నిబంధనలు, ప్రభుత్వా మార్గదర్శకాలను పాటించి బాణాసంచా విక్రయాలను చేపట్టాలని పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి పి. వెంకట రమణ వెల్లడించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి ప్రజలందరూ దీపావళి పండుగ నిర్వహించుకోవలన్నారు. మందుగుండు సామాగ్రిని విక్రయించే వారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి విక్రయాలను చేపట్టాలన్నారు. బాణాసంచా తయారుచేసే కేంద్రాల్లోనూ బాణాసంచాను విక్రయించే వ్యాపారులు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డివిజన్ పరిధిలో ప్రతి మండలాల్లో జాయింట్ బృందం పర్యవేక్షణలో బాణాసంచా విక్రయాలను చేపట్టడం జరుగుతుందని, ఈ జాయింట్ బృందంలో తహశీల్దార్, సబ్ ఇనస్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఫైర్ ఆఫీసర్ ఉంటారని, వీరు ప్రతిపాదన మేరకు సదరు ప్రదేశంలో బాణాసంచా వ్యాపారం నిర్వహించేందుకు రెండు రోజులు ముందు అనుమతులు మంజూరు చేస్తారన్నారు. తాత్కాలిక బాణాసంచా దుకాణంలో పెంకు చిచ్చుబుడ్లు నిషేధం అన్నారు. తాత్కాలిక బాణాసంచా అమ్మకందారులు నిర్దేశించిన పరిమాణం ప్రకారం మాత్రమే పేలుడు పదార్థాలను తయారీ కేంద్రంలో ఉండాలని, అంతకంటే ఎక్కువగా నిల్వ ఉంచితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాణాసంచా తయారీ కేంద్రంలో మాత్రమే ఉండాలి తప్ప పరిసర ప్రాంతాల్లో ఉండరాదని, తాత్కాలిక బాణాసంచా వ్యాపార షాపుల వద్ద పొగత్రాగుట నిషేధమని, దీనికి సంబంధించిన ఎంట్రీ బోర్డు ఉండాలన్నారు. బాణసంచా అమ్మకందారులు మందుగుండు సామాగ్రి తయారీ రవాణా, అమ్మకముల సమయంలో ప్రమాదాలు జరగకుండా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు పోలీసు అధికారులు నుంచి అనుమతి పొందాలని అన్నారు. మందు తయారీ కేంద్రంలో 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే పని చేయాలని, వారికి ఫైర్ ఫైటింగ్ మిషన్ ట్రైనింగ్ ఇవ్వాలని ,తాత్కాలిక ప్రాంతంలో పనిచేయుచున్న కార్మికుల వివరాలను తయారీ కేంద్రం బయట గోడకు అతికించాలన్నారు. తాత్కాలిక దుకాణాలకు, మరొక షాపునకు మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలని, మండల జాయింట్ బృందం సూచించిన ప్రదేశంలోనే అమ్మకాలు జరగాలి తెలిపారు. ఇతర వ్యాపార దుకాణాల్లో మందుగుండు సామాన్లు నిషేధము అన్నారు. ఎవరైనా ఇతర దుకాణాల్లో మందుగుండు సామాగ్రిని అమ్మినట్లయితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సరుకు అమ్మే ప్రదేశము ఊరికి దూరంగా ఖాళీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని, ఇసుక వాటర్, అగ్నిమాపక యంత్రాలను ప్రతి షాపు దగ్గర ఏర్పాటు చేసుకోవాలని, కోవిడ్ నిబంధనలు ప్రకారం అమ్మకందారులు మాస్కు ధరించాలని, అదేవిధంగా కొనుగోలుదారులు కూడా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ బాణాసంచా వస్తువులను కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆర్డీవో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us