UPDATED 26th FEBRUARY 2022 SATURDAY 10:00 PM
DJ Tillu: ఒకపక్క థియేటర్లలో కొత్త సినిమాలు.. స్టార్ హీరోల సినిమాల సందడి మొదలవగా.. ఇప్పటికే థియేటర్లలో వచ్చేసి రెండు వారాలు గడవడంతో వాటిపై ఓటీటీలు స్పెషల్ ఫోకస్ పెట్టేసి సాధ్యమైనంత త్వరగా ఓటీటీలో తీసుకొచ్చేసి క్యాష్ చేసుకొనే పనిలో ఉన్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో మాస్ రాజా రవితేజ ఖిలాడీ, సిద్ధూ డీజే టిల్లు, సెహరీ సినిమాలు థియేటర్లలో విడుదలవగా వాటిలో డీజే టిల్లు సినిమాగా రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్టు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
డీజే టిల్లు కామెడీకి యూత్ బాగా కనెక్ట్ కావడం,. సిద్ధూ మేనరిజమ్స్.. అర్బన్ లాంగ్వేజ్ యూత్ కి బాగా కనెక్ట్ అవడంతో థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లో కూడా టిల్లు హవా గట్టిగానే కనిపించగా.. ఫైనల్ గా జాతిరత్నాలు తర్వాత టిల్లు గాడు హిలేరియస్ కామెడీతోనే సక్సెస్ అయిపోయి.. ఆ వారం సినిమాలలో ఫైనల్ గా టిల్లు గాడే తోపు అయ్యాడు.