బాణాసంచా షాపులపై లీగల్ మెట్రాలజీ అధికారుల దాడులు

- నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా విక్రయాలు
- షాప్ ఒక్కంటికి రూ.మూడువేలు జరిమానా విధించిన తూనికలు,కొలతలు శాఖ అధికారులు
UPDATED 19th OCTOBER 2017 THURSDAY 2:30 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా దీపావళి బాణాసంచా విక్రయాలు సాగిస్తున్న షాపులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు గురువారం ఉదయం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అధిక ధరలకు బాణాసంచా విక్రయించడమే కాకుండా ఎంఆర్పీ ధరలు కంటే  అధికంగా అమ్మకాలు సాగించడం, అలాగే పాత బాణాసంచా సామాను విక్రయాలు, వాటిపై తయారీ ముద్రణ లేకపోవడం వంటి కారణాల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు పెద్దాపురం లీగల్ మెట్రాలజీ ఇనస్పెక్టర్ బి. సరోజ తెలిపారు. షాపు ఒక్కంటికి అపరాధ రుసుము క్రింద రూ. మూడు వేలు చొప్పున 24 షాపులకు గాను రూ.72 వేలు జరిమానా విధించారు. షాపులు ఏర్పాటు చేసే సమయంలో చూడవలసిన కనీస జాగ్రత్తలను సైతం రెవిన్యూ, పోలీస్, ఫైర్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కూడా లేవని పలువురు అధికారుల తీరును బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇటీవల భారీ అగ్నిప్రమాదం సంభవించిన సుధా ఫ్యాక్టరీ పక్కనే ఉన్న ఆవరణలో బాణాసంచా విక్రయ దుకాణాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడంపై కూడా పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని పలువురు ప్రజలు విమర్శిస్తున్నారు. పైగా బాణాసంచా విక్రయాల అనుమతుల మంజూరుకు భారీ స్థాయిలో పైరవీలు జరిగినట్టు సమాచారం. అలాగే అనుమతి లేకుండా ఒక షాపు సైతం నిర్వహించడం చూస్తుంటే పలు అనుమానాలు తావిస్తున్నాయి. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us