మహనీయుల ఆశయ సాధనలో పునరంకితమవుదాం

* ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ 
* ఘనంగా 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

UPDATED 15th AUGUST 2020 SATURDAY 8:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): వీరోచిత పోరాటాలు, నిస్వార్థ త్యాగాలతో స్వేచ్చా భారతావనిని నేటి తరానికి అందించిన మహనీయుల ఆశయాల బాటలో కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా దేశాభివృద్ధికి పునరంకితమవుదామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిప్టేషన్ శాఖా, తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని సాయుధ పోలీస్ దళాలు నిర్వహించిన గార్డ్ ఆఫ్ ఆనర్, మార్చ్ ఫాస్ట్ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకావిష్కరణ గావించి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ స్వేచ్ఛ కోసం జాతి ఏకత్రాటిపై నిలిచి జరిపిన స్వాతంత్ర్య సమర స్పూర్తితో కరోనా మహమ్మారి నిర్మూలనకు ప్రజలందరూ మరోమారు సమిష్టిగా ఉద్యమించాలని అన్నారు. మానవాళి మనుగడకు సవాలుగా నిలిచిన కరోనా వైరస్ ను తుదముట్టించేందుకు వ్యక్తిగత, సామాజిక జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ పరంగా చేపట్టిన నియంత్రణ చర్యలకు చిత్తశుద్దితో సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ప్రజల ఆరోగ్య, ప్రాణ రక్షణకు కోవిడ్-19పై పోరాడుతూ దురదృష్టవశాత్తు కరోనా వైరస్ సోకి మరణించిన అధికారులు, సిబ్బంది కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం కోవిడ్-19, లాక్ డౌస్ నేపథ్యంలో ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధి కోసం వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, ప్రణాళికలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు కరోనా వైరస్ పట్ల ప్రజలను చైతన్యపరస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి, కోవిడ్-19 నియంత్రణలో విశేష సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి మంత్రి కృష్ణదాస్ ప్రశంసించారు. శుక్రవారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం, కోవిడ్-19 నియంత్రణకు పాటిస్తున్న జాగ్రత్తల దృష్ట్యా వేడుకలలో శకటాల ప్రదర్శన, అవార్డులు, అసెట్స్ పంపిణీ కార్యక్రమాలను రద్దు చేశారు. జిల్లా పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన వారికి మహోన్నత సేవ, ఉత్తమ సేవ, సేవా పతకాలను మంత్రి కృష్ణదాస్ ప్రధానం చేసారు. మహోన్నత సేవా పతకం కింద ఎఆర్ అడిషనల్ ఎస్పీ వి.ఎస్. ప్రభాకరరావుకు మంత్రి పురస్కారం అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, చింతా అనురాధ, ఎమెల్సీ పండుల రవీంద్రబాబు, జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నామ్ నయీమ్ ఆస్మీ, జాయింట్ కలెక్టర్లు డాక్టర్  జి. లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి. రాజకుమారి, కాకినాడ నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ట్రైనీ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, ఎస్ఇబిఎస్పీ సుమిత్ గరుడ, అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, ఆర్డీఓఎజి చిన్నికృష్ణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us