పంచ్‌ ప్రభాకర్‌ అరెస్టుకు వారెంట్‌ తీసుకున్నాం: సీబీఐ

అమరావతి (రెడ్ బీ న్యూస్) 25 నవంబర్ 2021: జడ్జిలపై సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టుల కేసులో అఫిడవిట్‌ను సీబీఐ పిటిషనర్లకు పంపింది. ఇప్పటికే దీనిపై హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో పంచ్‌ ప్రభాకర్‌పై నవంబరు 1న లుకౌట్‌ నోటీసులు జారీ చేశామని సీబీఐ తెలిపింది. పంచ్‌ ప్రభాకర్‌ అరెస్టుకు నవంబరు 8న వారెంట్‌ తీసుకున్నామని పేర్కొంది. ప్రభాకర్‌ అరెస్టుకు సహకరించాలని ఈ నెల 9న ఇంటర్‌ పోల్‌కు విజ్ఞప్తి చేసినట్లు అఫిడవిట్‌లో వెల్లడించింది. ఈ అంశంపై ఇంటర్‌పోల్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. జడ్జిలపై పోస్టులు తొలగించడంపై ఈ నెల 15న యూట్యూబ్‌ ప్రతినిధులతో మాట్లాడినట్లు తెలిపింది. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ విచారిస్తున్నామన్న సీబీఐ ... ఈ కేసులో పంచ్‌ ప్రభాకర్‌ను 17వ నిందితుడిగా చేర్చినట్లు పేర్కొంది.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us