స్వచ్చ సర్వేరక్షణ్ ప్రచార రథంపై బుర్రకథ ప్రదర్శన

UPDATED 11th AUGUST 2018 SATURDAY 6:30 PM

పెద్దాపురం: జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామాలలో 15 రోజులపాటు ప్రచారాన్ని కళారూపాలు ద్వారా ఏర్పాటు చేశారు. ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రచార రథం పెద్దాపురం మండలం ఆర్.బి.పట్నం, చినబ్రహ్మదేవం, కొత్తూరు, కట్టమూరు తదితర గ్రామాల్లో శనివారం బుర్రకథ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.బి.పట్నం గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ఎఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు(రాజబ్బాయి),  ఎంపిపి గుడాల రమేష్ ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రామచంద్రపురంకు చెందిన ప్రేమానందం బుర్రకథ బృందంచే పారిశుద్యం, మరుగుదొడ్లు వాడకం, మొక్కలు పెంపకం, సీజనల్ వ్యాదులు, తదితర అంశాలపై ప్రదర్శన నిర్వహించి, ప్రజలతో స్వచ్చ సర్వేరక్షణ్ పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎఎంసి చైర్మన్  రాజబ్బాయి, ఎంపిపి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఏ విధంగా సద్వినియోగం  చేసుకోవాలో బుర్రకథ రూపంలో అవగాహన కల్పించారని, ప్రాచీన కళారూపాలతో గ్రామాల్లో అభివృద్ధి పనులపై ప్రచారం నిర్వహించడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కళాకారులను ఆదుకోవడమే కాకుండా వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. అనంతరం  గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి సచ్చ సర్వేరక్షణ్ పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో పి. వసంతమాధవి, ఇవోపిఆర్డీ కరక హిమమహేశ్వరి, సమాచార శాఖ పబ్లిసిటీ అసిస్టెంట్ సి.హెచ్. రాంబాబు, ఆఫీసు సబార్డునేట్ జె. సతీష్ బాబు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రామహిళలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us