దేశం గర్వించదగ్గ గొప్ప శాస్తవేత్త అబ్దుల్ కలాం

UPDATED 15th OCTOBER 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): దేశం గర్వించదగ్గ గొప్ప శాస్తవేత్త అబ్దుల్ కలాం అని ఆయన అందరికీ ఆదర్శనీయమని సామర్లకోట మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపిజె  అబ్దుల్ కలాం 88వ జయంతి వేడుకలను స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ ఏసుబాబు మాట్లాడుతూ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా దేశానికి ఎన్నో సేవలందించారని, ఆయన సేవలు నేటి యువతకు ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ నక్కా జానకిరామయ్య, ఉపాధ్యాయులు తాళ్ళూరి వైకుంఠం, షఫీ, రాజేంద్రకుమార్, కె. అరుణ, శ్రీవల్లి, కె.వి.వి.సత్యనారాయణ, ఏపి రాజేంద్రకుమార్, శివ, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us