త్యాగానికి ప్రతీక బక్రీద్‌

UPDATED 12th AUGUST 2019 MONDAY 7:00 PM

పెద్దాపురం: జీవితంలో త్యాగం విలువను తెలియజెప్పే గొప్ప పర్వదినం బక్రీద్‌ అని ముస్లిం మత పెద్దలు ఉద్బోధించారు. పెద్దాపురం పట్టణ, మండల పరిధిలో బక్రీద్‌ పర్వదినాన్ని సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం లేచి స్థానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి చిన్నా, పెద్ద అనే తారతమ్యం లేకుండా మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం అంజుమన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముక్తార్ ఆలీ ప్రసంగిస్తూ త్యాగానికి, దైవంపై విశ్వాసానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ బక్రీద్‌ అని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందాలంటే ప్రతీ ఒక్కరూ ప్రేమ, త్యాగం తదితర సుగుణాలు కలిగి ఉండాలని అన్నారు. అల్లా దయ పొందిన హజరత్‌ ఇబ్రహీం నడిచిన త్యాగాల బాటలో ముస్లింలు పయనించాలని, దైవం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఆయన బోధించారు. ప్రార్థనల అనంతరం పేదలకు దానధర్మాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ ఆలీ బ్రదర్స్, సయ్యద్ అబ్దుల్ ఖాదర్, ఎస్.కె. బాబూలాల్, రఫీ, అబ్దుల్ రజాక్, కరీం, అహ్మద్, ముస్తాఫా, ఎండి జానీ, హఫీజ్, రవూఫ్, అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.       

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us