ఆదిత్యలో ఎంసెట్ సెంటర్ ను సందర్శించిన వైస్ ఛాన్సలర్

UPDATED 25th APRIL 2018 WEDNESDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో నిర్వహిస్తున్న ఎ.పి ఎంసెట్ - 2018 ఆన్ లైన్ సెంటర్ ను కాకినాడ జె.ఎన్.టి.యు ఇంచార్జ్  వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్. రామకృష్ణారావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షకు హాజరైన విద్యార్థులను ఏర్పాట్లు  గురించి అడిగి తెలుసుకున్నారు. చక్కటి ల్యాబ్, ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాలకు విచ్చేసిన ఆయనకు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వివిధ కళాశాలలకు చెందిన వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఇంజనీరింగ్, 25వ తేదీన మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఈ పరీక్షల నిర్వహణకు పర్యవేక్షకునిగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. ఉదయ భాస్కర్  విచ్చేశారని తెలిపారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us