ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

updated  April 5, 2017,  4:56 pm
పెద్దాపురం: పట్టణ, మండల పరిధి లోని అన్ని గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అన్నిఆలయాలు రామ నామ స్మరణ తో మారుమ్రోగాయి. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున రామాలయాలకు చేరుకున్నారు. రామ నామ స్మరణ చేస్తూ కల్యాణ మహోత్సవాన్ని భక్తిపారవశ్యంతో కనులారా తిలకించారు. వేదపండితుల మంత్రో చ్చారణల నడుమ సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకం గా అలంకరించి ఘనం గా జరిపించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక మహారాణి సత్రంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవాలలో పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజాసూరిబాబురాజు పాల్గొన్నారు.  పట్టణ పరిధిలోని  అన్ని ప్రాంతాల్లో కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకం, చలివిడి, వడపప్పు ను ప్రసాదాలుగా వితరణ చేశారు. అలాగే భారీ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.        

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us