ఏపీలో సహకార ఎన్నికలు..ఎప్పుడంటే

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 25 ఆక్టోబర్ 2021: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. సహకార ఎన్నికలపై ఎట్టకేలకు జగన్ సర్కారులో కదలిక వచ్చింది. కరోనా సాకుతో సహకార ఎన్నికలు నిర్వహించడం లేదని దాఖలైన వ్యాజ్యంపై ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలకు సుముఖత తెలుపింది. కోర్టుకు కౌంటర్ దాఖలు చేయనున్నట్లు కూడా వెల్లడించింది. పీఏసీఎస్ లకు త్రిసభ్య కమిటీలు, డీసీసీబీ, డీసీఎంఏకు ఏడుగురు సభ్యులు, ఆప్కాబ్ కు పర్సన్ ఇన్ చార్జిని నియమించిన ప్రభుత్వం, వారి గడువు (2022 జనవరి 31తో) ముగిసేలోగా ఎన్నికలు జరపడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. డిసెంబరు మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ, జనవరిలో ఎన్నికలు జరపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us