సోనూసూద్ బయోపిక్ పుస్తకం అందుకున్న ఆచార్య

రెడ్ బీ న్యూస్: కరోనా కష్టకాలంలో.. రియల్‌ హీరోగా మారి.. ఎందరో పేదలను ఆదుకున్న నటుడు సోనూసూద్‌. కష్టంగా ఉందని ఎవరు మెసేజ్‌ పెట్టినా.. వెంటనే స్పందిస్తూ.. వారి కష్టాలను తీర్చేస్తున్న సోనూసూద్‌పై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన నుంచి సాయం పొందిన వారంతా.. ఆయనను మెసయ్య అని పిలుస్తున్నారు. ఇదే పేరుతో సోనూసూద్‌ బయోపిక్‌ పుస్తకరూపంలో రాబోతుందనే విషయాన్ని ఇటీవల సోనూసూద్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 'ఐ యామ్‌ నో మెసయ్య' అనే టైటిల్‌తో రెడీ అయిన ఈ బుక్‌ను మెగాస్టార్‌ చిరంజీవికి 'ఆచార్య' షూటింగ్‌ సెట్స్‌లో అందించారు సోనూసూద్‌. ఈ బుక్‌ అందుకున్న మెగాస్టార్ ట్విట్టర్ ద్వారా‌ స్పందిస్తూ.. ''సోనూసూద్‌ మీ 'ఐ యామ్‌ నో మెసయ్య' బుక్‌ విడుదల సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు. పుట్టుకతో ఎవరూ హీరోలు కారని, ఆ తర్వాత నడిచే విధానంతోనే హీరోలుగా మారతారని మరోసారి మీరు నిరూపించారు. ఈ కష్టకాలంలో వేలాదిమందిని మీరు ఆదుకున్నారు. మీ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం.." అని తెలుపుతూ.. సోనూసూద్‌ నుంచి బుక్‌ అందుకుంటోన్న పిక్‌ని పోస్ట్ చేశారు. చిరు ట్వీట్‌కు రిప్లయ్‌ ఇచ్చిన సోనూసూద్‌..''అత్యంత ప్రియమైన మనిషి నుంచి.. ఇంత గొప్ప ప్రేమను పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మాటలు రావడం లేదు.. ధన్యవాదాలు సార్‌. ఎప్పుడూ నేను చెప్పేది ఒక్కటే సార్‌ 'యు ఆర్‌ ద బెస్ట్'. మీరు ఈ బుక్‌ చదివిన తర్వాత ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ కోసం వేచిచూస్తున్నాను. లవ్‌ యు సార్‌..'' అని తెలిపారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us