PM Modi : స్వార్ధరాజకీయల కోసమే ఏపీని హడావిడిగా విభజించారు.

UPDATED 8th FEBRUARY 2022 TUESDAY 01:40 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): లోక్ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ‌ సంద‌ర్భంగా ఇవాళ రాజ్య‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.స్వార్ధరాజకీయల కోసమే ఏపీని హడావిడిగా విభజించారనీ..కేంద్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీని ఎంతో సిగ్గు పడే విధంగా విభజించారని కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు.

అత్యంత దారుణంగా ఏపీని విభజించారని.. మైకులు ఆపేశారని.. పెప్పర్ స్ప్రే వాడే వరకు పరిస్థితులను అత్యంత సిగ్గుచేటుగా మార్చేశారని అన్నారు. ఉమ్మడి ఏపీని విభజించే సమయంలో చాలాకీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉందని కానీ..అప్పుడు అధికారంలోఉన్న కాంగ్రెస్ మాత్రం అటువంటిది ఏమీ చేయలేదని..విభజన అంశంలో ఎలాంటి చర్చ జరుపకుండానే విభజన ప్రక్రియ చేసిపారే చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

ఒక రాష్ట్రాన్ని విభజన చేసే ప్రక్రియ చాలా కీలకంగా ఉంటుందనీ..అటువంటి వ్యవహారాన్ని అత్యంత సాదాసీదాగా వివాదాస్పదంగా చేశారని ఇది సరైన పద్ధతా?..? ఇదేనా ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. దివంగత ప్రధాని..బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారి వాజ్ పేయ్ ప్రభుత్వంలో 3 రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని..రాష్ట్రాల ఏర్పాటును తాము ఏనాడు వ్యతిరేకించలేదుని అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా తాము ఎన్నడూ వ్యతిరేకించలేదని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టంచేశారు.కానీ విభజన ప్రక్రియ మాత్రమే సరిగా లేదని అందుకే..దానికి ప్రతిఫలంగానే ఈనాడు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు నష్టం జరిగిందని అన్నారు.

ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, ఉత్తర్ ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో శాంతియుత వాతావరణంలో అందరూ చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. కానీ ఏపీ, తెలంగాణ విభజన ప్రక్రియ విషయం మాత్రం చాలా దారుణంగా..స్వార్ధరాజకీయాల కోసమే జరిగిందని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ విభజన కూడా ఇలానే శాంతియుతంగా జరిగేది…కానీ కాంగ్రెస్ అలా చేయలేదు. జరగాల్సిన ప్రక్రియను హడావిడాగా చేసి పారేసిందని ప్రధాని మోడీ ఘాటు విమర్శలు చేశారు.

కలిసి చర్చించి.. శాంతియుతంగా విభజన జరిగే విషయాన్ని హడావిడిగా జరిగిందని..ఇది కాంగ్రె అహంకారం, అధికార మత్తు కారణంగా జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన హడావిడి ప్రక్రియవల్లే ఏపీ, తెలంగాణాల మధ్య విద్వేషం పెరిగిందన్నారు. కాంగ్రెస్ చేసిన ఈ కారణంగా ఏర్పడిన విద్వేషం ఈరోజు కి కూడా తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు నష్టం చేకూర్చుతోందన్నారు. కాంగ్రెసే విభజించినా రెండు రాష్ట్రాలోను మీకు ఎలాంటి రాజకీయ లబ్ది జరగకపోగా తీవ్ర నష్టం కలిగిందని ఇది కాంగ్రెస్ చేసిన దానికి ఫలితం అని మోడీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ వ‌ల్లే ఇప్ప‌టికే ఆ రెండు రాష్ట్రాల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న ప‌రిస్థితులు నెల‌కొన్న‌ట్లు మోదీ ఆరోపించారు. కుటుంబ పాల‌న క‌న్నా ఎక్కువ ఏదీ లేద‌న్న ఆలోచ‌న‌లో కాంగ్రెస్ పార్టీ ఉన్న‌ట్లు ప్ర‌ధాని మోదీ విమ‌ర్శించారు. భార‌త ప్ర‌జాస్వామ్యానికి అతి పెద్ద ప్ర‌మాదం డైనాస్టిక్ పార్టీలు అని, ఆ ప్ర‌మాదాన్ని గుర్తించాల‌ని అన్నారు. అర్బ‌న్ న‌క్స‌ల్స్ త‌ర‌హాలో కాంగ్రెస్ పార్టీ ఆలోచ‌న మారింద‌న్నారు ప్రధాని మోదీ.

మ‌హాత్మా గాంధీ ఆశించిన‌ట్లు కాంగ్రెస్ పార్టీని ర‌ద్దు చేసి ఉంటే.. కుటుంబ పాల‌న నుంచి ప్ర‌జాస్వామ్యం విముక్తి అయ్యేద‌న్నారు. జాతీయ తీర్మానాల దిశ‌గా దేశం ముందుకు వెళ్లేద‌న్నారు. కాంగ్రెస్ లేకుంటే.. దేశంలో ఎమ‌ర్జెన్సీ ఉండేది కాద‌ని ప్ర‌ధాని అన్నారు. ఒక‌వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుంటే అప్ప‌డు సిక్కుల ఊచ‌కోత ఉండేది కాద‌ని ఈ సందర్భంగా ఆనాటి పరిస్థితులను ప్రధాని మోడీ గుర్తుచేశారు. ఉగ్ర‌వాద కోర‌ల్లో పంజాబ్ ద‌గ్ధం అయ్యేది కాద‌నీ..క‌శ్మీర్ పండిట్లు క‌శ్మీర్‌ను వ‌దిలి వెళ్లేవారుకాద‌న్నారు. కాంగ్ర‌స్ పాల‌న‌లో లేకుంటే ఈ దేశ ఆడ‌ప‌డుచుల్ని తందూర్‌లో వేసేవాళ్లు కాద‌ని మోదీ విమ‌ర్శించారు.

ప్ర‌ధాని మోదీ విరుచుకుప‌డ్డ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్య‌స‌భ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై స‌మాధానం ఇవ్వ‌కుండా.. కాంగ్రెస్ పార్టీని నిందించ‌డ‌మే ప‌నిగా ప్ర‌ధాని మాట్లాడుతున్నార‌ని ఖ‌ర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తు వాకౌట్ చేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us