TS News: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

Updated 1 February 2022 Tuesday 08:00 PM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): నిరుద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 40వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. రేపో మాపో ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే ల‌క్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు.

కొత్త జోన‌ల్ విధానం తీసుకొచ్చామని, రాష్ట్ర యువ‌త హ‌క్కులు సాధించామని, 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ద‌క్కేలా చేసిన‌ ఘ‌న‌త టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుందని కేసీఆర్ అన్నారు. మ‌ల్టీ జోన‌ల్ పోస్టింగ్ విధానం తీసుకొచ్చామన్న కేసీఆర్.. దీని ద్వారా నాన్ లోకల్ వారు 5శాతం మాత్ర‌మే వ‌స్తారని చెప్పారు.

ప‌రిపాల‌న అంటే ఏంటో తెలియ‌ని వారంతా ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డ కేసీఆర్.. 317 జీవోను విమ‌ర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. కొంత‌మంది స్వార్థ‌ప‌రులైన ఉద్యోగులు మేం ఇక్క‌డే ఉంటామ‌ని అంటున్నారు.. 317 జీవో గురించి మాట్లాడితే వారిని లాగి కొట్టాలన్నారు. 317 జీవోతో స్థానికులకు ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయని క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. ”

దేశంలో 15లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో త్వరలో 40వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం. తెలంగాణలో 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. మల్టీజోనల్‌ విధానం వల్ల 2-3 శాతమే స్థానికేతరులకు వస్తాయి. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలనే మల్టీజోన్‌ విధానం తెచ్చాం. 317 జీవో వల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి” అని కేసీఆర్ అన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సీఎం కేసీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌ చాలా దారుణంగా ఉందని అన్నారు. ఆర్థిక మంత్రి ఆత్మవంచన చేసుకున్నారని, దేశ ప్రజలను వంచించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి బడ్జెట్‌లో రూ.12,800 కోట్లే కేటాయించారని కేసీఆర్ అన్నారు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోనే రూ.33,600 కోట్లు కేటాయించామన్నారు. ఎస్సీల జనాభాపై కేంద్రం అబద్ధాలు చెబుతోందని కేసీఆర్ విమర్శించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రానికి మెదడు లేదని, గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు బీజేపీ.. దేశ వినాశనానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ”దేశాన్ని కాపాడుకునే భాధ్యత ప్రజలు, యువతదే. మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఆర్థిక అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌ వన్‌ తెలంగాణ. ఈసారి రూ.30వేల కోట్ల అదనపు రాబడి వస్తోంది. కరోనా అతలాకుతలం చేసినా పురోభివృద్ధి సాధిస్తున్నాం’’ అని కేసీఆర్ అన్నారు.

నదుల అనుసంధానం మిలీనియం జోక్‌.. కావేరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని బడ్జెట్‌లో తెలిపారు.. ఇది ఎలా సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. నదులు అనుసంధానం చేస్తామనడం ఓ పెద్ద జోక్‌ అన్నారు. ‘‘ఈ మూడు నదులను అనుసంధానం చేస్తామని ఏ అధికారంతో చెప్పారు. గోదావరి జలాల విషయమై ట్రైబ్యునల్‌లో కేసు ఉంది. గోదావరి జలాల్లో ప్రతి బొట్టుపై తెలుగు రాష్ట్రాలకే అధికారం ఉంది. మాకు హక్కు ఉన్న జలాలను కావేరీలో ఎలా కలుపుతారు. అభిప్రాయాలు తీసుకోకుండా బడ్జెట్‌లో ఎలా ప్రకటిస్తారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ప్రజలకు సాగునీరు అందిస్తున్నాం. దేశంలో 65 వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. కానీ, 35 వేల టీఎంసీల నీళ్లు మాత్రమే వినియోగంలోకి తెచ్చారు. కేంద్రం విధానాల వల్లే భారత్‌లో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. కేంద్ర జల విధానాల వల్ల రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. జల్‌శక్తి మిషన్‌కు రూ.60వేల కోట్లని గొప్పలు చెబుతున్నారు. 140 కోట్ల దేశ జనాభాకు రూ.60వేల కోట్లా? తెలంగాణలో మిషన్‌ భగీరథకు రూ.40 వేల కోట్లు కేటాయించాం. జల్‌శక్తి మిషన్‌ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు’’ అని కేసీఆర్‌ ఆరోపించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us