యూట్యూబ్‌లో కొడ‌కా సాంగ్‌ హల్ చల్

UPDATED 1st JANUARY 2018 MONDAY 11:45 AM

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెర‌కెక్కిన అత్తారింటికి దారేది చిత్రంలో 'కాటమరాయుడా కదిరీ న‌రసింహుడా' అనే పాట‌ని ప‌వ‌న్ చేత పాడించి మాట‌ల మాంత్రికుడు. ఇప్పుడు తాజాగా అజ్ఞాత‌వాసి చిత్రం కోసం 'కొడకా కోటేశ్వరరావు' అనే పాట పాడించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటించారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతంలో రూపొందిన ఈ సాంగ్ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 31న విడుద‌లైంది. విడుద‌లైన కొన్ని గంట‌ల‌లోనే ఈ సాంగ్ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఈ పాట రిలీజై 24 గంటలు గడవకముందే, యూట్యూబ్ లో 2.78 మిలియన్ల వ్యూస్, 2.27 లక్షల లైక్స్ ను రాబట్టింది. దీనిని బ‌ట్టి చూస్తే ప‌వ‌న్ పాట‌కి ఫ్యాన్స్ ఎంత‌గా ముగ్ధుల‌య్యారో తెలుస్తోంది. జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానున్న చిత్రం కోసం ఫ్యాన్స్‌ చాలా ఆస‌క్తిగా ఎద‌రు చూస్తున్నారు. ఓవ‌ర్సీస్‌లో భారీ సంఖ్య‌లో విడుద‌ల కానున్న అజ్ఞాత‌వాసి చిత్రం తెలుగు రాష్ట్రాల‌లోను ఎక్కువ థియేట‌ర్స్‌లో విడుద‌ల కానుంది. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us