వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి: కలెక్టర్లకు సీఎం జగన్‌ ఆదేశాలు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలెక్టర్లను ఆదేశించారు. బాధితులు చెబుతోన్న సమస్యలను తెలుసుకొని ఉదారంగా స్పందించి తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి వసతుల పునరుద్ధరణపై దృష్టిపెట్టాలన్నారు. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే కాలువలు సహా ప్రత్యామ్నాయ విధానాల ద్వారా బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. పాక్షికంగా, లేదా పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం, 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన కాల్స్, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, 2వేల రూపాయల అదనపు సాయం పంపిణీ తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. నిత్యావసరాల పంపిణీ, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణ, చెరువుల భద్రత, గండ్లు పూడ్చివేత, తాగునీటి సరఫరా, గల్లంతైన వారికి పరిహారం, మరణించిన పశువులకు పరిహారం సహా పలు అంశాలను సీఎం సమీక్షించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us