చైనాలో 9వేల థియేట‌ర్ల‌లో దంగ‌ల్

Updated 5th May 2017 Friday 4:00 PM

న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ న‌టించిన దంగ‌ల్ సినిమా ఇవాళ చైనాలో రిలీజ్ అయ్యింది. సుమారు తొమ్మిది వేల థియేట‌ర్ల‌లో దంగ‌ల్ విడుద‌లైన‌ట్లు ఆ ఫిల్మ్ నిర్మాత‌లు చెప్పారు. విదేశీగ‌డ్డ‌పై భార‌తీయ చిత్రం అన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డం ఇదే మొద‌టిసారి. దంగల్ స‌రికొత్త రికార్డు స్థాపించింద‌ని డిస్నీ ఇండియా స్టూడియోస్ అధ్య‌క్షుడు అమృత్ పాండే తెలిపారు. చైనాలో సుమారు 40 వేల థియేట‌ర్లు ఉన్నాయి. అందులో 9 వేల థియేట‌ర్ల‌లో దంగ‌ల్ రిలీజ్ అవుతుంది. సుహాయ్ జియో బాబా టైటిల్‌తో దంగ‌ల్‌ను చైనాలో రిలీజ్ చేస్తున్నారు. 'రెజ్లింగ్ చేద్దాంరా నాన్న' అన్న అర్థం వ‌చ్చే విధంగా టైటిల్‌ను మార్చారు. భార‌తీయ రెజ్ల‌ర్ మ‌హావీర్ పోగ‌ల్ జీవిత క‌థాంశంతో దంగ‌ల్ చిత్రాన్ని నిర్మించిన విష‌యం తెలిసిందే. ఇండియాలో ఈ ఫిల్మ్ 400 కోట్లు సంపాదించింది. గ‌త నెల‌లో బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us