AP News: గుడివాడలో క్యాసినో ఆరోపణలు.. చంద్రబాబుకు నిజనిర్ధారణ కమిటీ నివేదిక

Updated 24 January 2022 Monday 16:30 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్) : గుడివాడలో క్యాసినో ఆరోపణల వ్యవహారంలో టీడీపీని నిజ నిర్ధారణ కమిటీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదిక అందజేసింది. సంక్రాంతి పండుగ వేళ గుడివాడలో క్యాసినో, జూదం, పేకాట, అసభ్యకర నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని నేతలు నివేదికలో పేర్కొన్నారు. రూ.500 కోట్లు చేతులు మారాయని వెల్లడించారు. మంత్రి కొడాని నానికి చెందిన కె కన్వెన్షన్లో క్యాసినో నిర్వహించారని ఆరోపిస్తూ టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలో పరిశీలనకు వెళ్లింది ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పర్యటన అనంతరం నివేదిక రూపొందిన కమిటీ సభ్యులు ఇవాళ చంద్రబాబుకు దాన్ని అందజేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us