CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువే : సీఎం జగన్

UPDATED 27th JUNE 2022 MONDAY 01:00 PM

AP CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువేనని సీఎం జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ ఏపీ సీఎం జగన్ పర్యటించారు. అమ్మ ఒడి మూడో విడత డబ్బులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువే నిజమైన ఆస్తి అని అన్నారు. చదువులు బాగున్న దేశాలలో ఆదాయం ఎక్కువని తెలిపారు.వారి తలసరి ఆదాయం కూడా ఎక్కువగానే ఉంది.. అందుకు కారణం చదువేనని స్పష్టం చేశారు.

చదువుల మీద పెట్టే ప్రతీ పైసా.. పిల్లల భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి అని చెప్పారు. ప్రతీ ఒక్కరికీ చదువు దక్కాలని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని తెలిపారు. జగనన్న అమ్మవడి డబ్బులు నేడు అందజేస్తున్నామని చెప్పారు. 80 లక్షల పిల్లల 43 లక్షల 96 వేల 402 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6వేల 595 కోట్లు జమచేయనున్నామని తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us