RC15: పొలిటికల్ సాంగ్ అందుకుంటున్న చరణ్..?

UPDATED 18th JULY 2022 MONDAY 09:40 PM

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా వస్తోంది. ఇక ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు శంకర్ తనదైన మార్క్ కంటెంట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే శంకర్ చిత్రాల్లో ఖచ్చితంగా సమాజానికి ఓ మెసేజ్ ఉండటం ఆనవాయతీగా వస్తుంది. అయితే ఈ సినిమాలో కూడా అలాంటి పాయింట్‌తోనే ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడట. కాగా, ఈ సినిమాను ప్రస్తుత రాజకీయాలపై సెటైరిక్‌గా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో చరణ్ ఓ పొలిటికల్ సెటైర్ సాంగ్ కూడా పాడబోతున్నాడట.

ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను మన కళ్లకు కట్టినట్లుగా ఈ పాటలో చూపించబోతున్నారట చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us