సూర్యచంద్రులపై సర్వజగద్రక్షకుడు

ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021: సమస్త లోకాధిపతి శ్రీమన్నారాయణుడు సూర్యచంద్రులపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సప్త అశ్వాలతో కూడిన సూర్యప్రభ వాహనంపై శ్రీకృష్ణపరమాత్మ అవతారంలో విహరించిన శ్రీనివాసుడు, రాత్రి అమృత కిరణాలు గల చంద్రప్రభ వాహనంపై మోహినీ అలంకరణలో ఊరేగారు. ఈ సందర్భంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, మహాపుష్పయాగం, సహస్రదీపాలంకరణ సేవ తదితర కార్యక్రమాలను పండితులు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యుల నేతృత్వంలో కనుల పండువగా నిర్వహించారు. స్వామివారికి దేవస్థాన పాలకమండలి ఛైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఉమాదేవి, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us