ప్రగతిలో స్ట్రైడ్స్ 2కె18 ముగింపు వేడుకలు

UPDATED 8th MARCH 2018 THURSDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి సాంకేతిక సదస్సు స్ట్రైడ్స్ 2కె18 మూడవరోజు కార్యక్రమాలలో భాగంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం యెఱుడైట్- 2కె18 పేరిట సాంకేతిక సదస్సు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జె.ఎన్.టి.యు.డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎ. గోపాలకృష్ణ హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి యెఱుడైట్-2కె18 సావనీర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానాన్ని జాతీయస్థాయిలో వాస్తవ దృక్పథంతో అమలుపరచడానికి అవకాశాలు కలుగచేసే విధంగా తాము నిర్వహిస్తున్న యెఱుడైట్- 2కె18 సాంకేతిక సదస్సు మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక వేదికగా నిలుస్తుందన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మెకానికల్ ఇంజనీరింగ్ ఆవశ్యకత ఎంతో ఉందని, దానికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకుంటూ బహుముఖ ప్రజ్ఞాశాలులుగా రూపొందడానికి ఇటువంటి సాంకేతిక సదస్సులలో పాల్గోవాలని  అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్ లో విజయాల బాటను అనుసరించాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తమకు అందివస్తున్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ డాక్టర్ పి. కుమార్ బాబు మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న వివిధ కార్యకలాపాలకు అధిక సంఖ్యలో అభ్యర్థుల నుంచి పోటీ అంశాలు రాగా వాటి నుంచి 22 పేపర్ ప్రెజంటేషన్స్, 16 పోస్టర్ ప్రెజంటేషన్స్, 11 మోడల్ ఎక్స్ పో ప్రెజంటేషన్స్, 20  టెక్నికల్ క్విజ్ అంశాలు, 12 కాంట్రక్షన్ ప్రెజంటేషన్స్, 42 హైడ్రో రాకెట్ ప్రెజంటేషన్స్, 31 ఆర్ట్ గాలరీ ప్రెజంటేషన్స్, 16 కాడ్ మానియాటంస్ తుది పోటీకి ఎంపిక చేశామన్నారు. వీటితోపాటు సి.ఎన్.సి. మిషనింగ్ వర్క్ షాప్ అంశం క్రింద 63  మందిని, బై ట్రబుల్ షూటింగ్ క్రింద 76 మందిని ఎంపిక చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, కార్యక్రమ కన్వీనర్ సి.హెచ్. వసంతలక్ష్మి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.            
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us