మారేడుమిల్లిలో రూ.2.15 లక్షల విలువైన తెలంగాణ మద్యం పట్టివేత

మారేడుమిల్లి:2 జులై 2020:(రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కాటవరం గ్రామం నుంచి జిల్లాలోని రావులపాలెం గ్రామానికి ట్రక్కులో మద్యాన్ని తరలిస్తుండగా సీఐ రవికుమార్, ఎస్సై.రామకృష్ణ పట్టుకున్నారు. రూ.2.15 లక్షల విలువైన 1820 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జొన్నాడకు చెందిన చంద్రశేఖర్, రాజబాబును పోలీసులు అరెస్టు చేశారు. దీంతోపాటు వాహనాన్ని సీజ్ చేశారు. ఈ మద్యం విలువ తెలంగాణలో రూ.2.15 లక్షలు కాగా.. రాష్ట్రంలో రూ.3.77 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us