కొత్త తుంగపాడులో గైట్ విద్యార్థుల ర్యాలీ

UPDATED 20th MARCH 2018 TUESDAY 9:30 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) అటానమస్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మండలంలోని కొత్త తుంగపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరంలో భాగంగా ఐదవరోజు "డెంగ్యూ వ్యాధి నివారించండి-దోమలపై దండయాత్ర" ర్యాలీలను మంగళవారం నిర్వహించారు. పరిసర ప్రాంతాలలో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమలు వ్యాప్తిని నిరోధించాలని నినాదాలు చేశారు. అలాగే గ్రామంలో అక్షరాస్యతపై సమాచారాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో గైట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం.వి.సుబ్బారావు, వాలంటీర్లు పాల్గొన్నారు.     

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us