Calender inauguration: రెడ్ బీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: రెడ్ బీ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రముఖ పారిశ్రామికవేత్తలు, లలితా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టర్లు మట్టే శ్రీనివాస్, మట్టే సత్య ప్రసాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ నెట్ వర్క్ - 1 జనరల్ మేనేజర్ ఎండీ విన్సెంట్ చేతులమీదుగా బుధవారం ఆవిష్కరించారు. పెద్దాపురం పట్టణంలో ప్లీడర్స్ వీధిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన కార్యాలయ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం అనంతరం నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణలో వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికితీసి, నిజాలను నిర్భయంగా ప్రచురించడంలో రెడ్ బీ న్యూస్ ముందుంటుందన్నారు. మీడియా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది అయిన డిజిటల్ మీడియా మాధ్యమం ద్వారా నూతన ఒరవడితో ప్రజాసమస్యల పరిష్కారానికి రెడ్ బీ న్యూస్ చేస్తున్న కృషిని ఈసందర్భంగా వారు అభినందించారు. అలాగే రెడ్ బీ న్యూస్ మరింతగా అభివృద్ధి చెంది విజయపథంలో దూసుకుపోవాలని వారు ఆకాక్షించారు. ఈనూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని వారు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో లలితా ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు మట్టే ఆదిశంకర్, ఆదిత్య కృష్ణ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీయం ఎస్. సురేష్ ప్రభు, రీజినల్ మేనేజర్ ఎం. సురేష్ బాబు, బ్రాంచి మేనేజర్ గానశ్రీ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు, రెడ్ బీ న్యూస్ ప్రతినిధి ఎన్. శ్రీరామ్, సమాచార శాఖ పెద్దాపురం డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎంవీ ఆలీ, ఫర్ ది పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ గుణ్ణం లక్ష్మణరావు, పాత్రికేయులు సుధాకర్, వినాయక్, ప్రభుదాస్, విల్సన్ రాయ్ (చింటూ) తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us