బాహుబ‌లి @ 1500 కోట్లు!

UPDATED 15TH MAY 2017 MONDAY 10:00 PM

REDBEENEWS: క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తున్న జ‌క్క‌న్న బాహుబ‌లి 2.. ఇప్పుడు మ‌రో రికార్డుకు చేరువ‌వుతున్న‌ది. ఈ వారం ముగిసేలోపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌లెక్ష‌న్లు రూ.1500 కోట్ల మార్క్‌ను దాట‌నుంది. రిలీజైన 17 రోజుల్లోనే రూ.1400 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు సాధించింది బాహుబ‌లి 2. ఇప్ప‌టికే హౌజ్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో న‌డుస్తుండ‌టంతో మ‌రో వంద కోట్లు రావ‌డం పెద్ద క‌ష్టమేమీ కాద‌ని ట్రేడ్ అన‌లిస్టులు అంచ‌నా వేస్తున్నారు. వెయ్యి కోట్లు దాటిన తొలి ఇండియ‌న్ సినిమాగా చ‌రిత్ర సృష్టించిన బాహుబ‌లి.. ఇప్ప‌ట్లో చెరిగిపోని మ‌రో అరుదైన రికార్డు సొంతం చేసుకోబోతున్న‌ది. హిందీలోనూ ఈ మ‌ధ్యే దంగ‌ల్ బాక్సాఫీస్ రికార్డుల‌ను మించి.. అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా నిలిచిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 9 వేల థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజైంది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us