ముఖేష్ అంబానీ కొత్తింటికి ఎట్రాక్షన్‌గా మారిన కడియం నర్సరీ మొక్కలు.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా..

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి సుందరీకరణకు.. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నుంచి చెట్లు బయలుదేరాయి. వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి సుందరీకరణకు.. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నుంచి చెట్లు బయలుదేరాయి. అదేంటీ.. చెట్లు బయలెళ్లడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు చదివింది నిజమే.. ముఖేష్ అంబానీ ఇష్టపడ్డ ఆ మొక్కల ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చెట్లుగా మారి ఇప్పుడు ఆయన నూతన నివాసానికి స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారబోతున్నాయి. సువిశాలమైన గార్డెన్‌లో ఈ మొక్కలు ఉంటే వచ్చే అందమే వేరు. చాలా ప్రత్యేకతలు కలిగిన ఈ మొక్కల రేటు ఎంతో తెలుసా? ఒక్కొ మొక్క పాతిక లక్షల రూపాయలు. రెండు మొక్కలు అర కోటి. అలాగని ఇదంతా నర్సరీ రైతు లాభం మాత్రమే కాదు. వీటిని స్పెయిన్ నుంచి ఓడలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక కంటైనర్‌లో లక్షలాది రూపాయల పెట్టుబడితో కడియంకు తరలించారు. అంటే ఈ రెండు మొక్కల ఖర్చు అర కోటి కాదు.. అంతకుమించి అన్నమాట. మొక్కలకి గోదావరి మట్టి, నీళ్లతో ప్రత్యేక పోషణ చేపట్టారు. వెరైటీ రూపురేఖలు సృష్టించారు. చూడ్డానికి మహావృక్షాల్లా కనిపిస్తున్నాయి కానీ ఇవి నిజంగా మొక్కలే. కింది భాగం మెలికలు తిరిగినట్టు.. పై భాగంలో నిటురుగా అక్కడక్కడ గుబురుగా చాలా అందంగా తీర్చిదిద్దారు. రెండు ఆలివ్ మొక్కలతో పాటు నాలుగు నెట్‌ ఫారెస్ట్‌ మొక్కలు.. 8 స్పీ వైరల్‌ మొక్కలు.. ఓ కల్పవృక్షం అంబాని కొత్తగా నిర్మించే ఇంటికి వెళ్లాయి.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us