కోనేరులో మునిగి బాలుడు మృతి

UPDATED 8th FEBRUARY 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని భీమేశ్వరస్వామి దేవాలయ పుష్కరిణిలో ప్రమాదవశాత్తు నీట మునిగి బాలుడు మరణించాడు. గురువారం పాఠశాలలకు బంద్ కావడంతో వేట్లపాలెం ప్రభుత్వ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న వినోద్ తన స్నేహితులతో కలిసి స్నానం నిమిత్తం కోనేరులోకి దిగాడు. ఆ ప్రాంతం లోతుగా ఉండడంతో అకస్మాత్తుగా నీటిలో పడి మునిగిపోయాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే దేవాదాయ శాఖ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టి బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.      

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us