ఘనంగా సత్తెమ్మతల్లి జాతర మహోత్సవాలు

UPDATED 16th JANUARY 2019 WEDNESDAY 10:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం నుంచి జగ్గంపేట వెళ్లే రహదారిలో పాండవులమెట్ట వద్ద వేంచేసి ఉన్న సత్తెమ్మఅమ్మవారి 45వ వార్షిక జాతర మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని అస్సాం, బదిరీనాథ్‌, కేదారినాథ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ అమ్మ వారికి హోమాలు, విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, రంగంపేట, సామర్లకోట, కిర్లంపూడి, ప్రత్తిపాడు మండలాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జాతరను పురస్కరించుకొని కోలాటం, ఆర్కెస్ట్రా, పెద్దపులి వేషాలు, 108 గరగలు, డప్పులతో అమ్మవారి జాతరను విశేషంగా నిర్వహించారు. పెద్దాపురం పట్టణ ఆరాధ్య దేవత సత్తెమ్మఅమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజుతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన హోంమంత్రికి ఆలయ అర్చకులు పప్పల నాగరాజు, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం పాండవుల మెట్ట వద్ద ఉన్న సత్తెమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపిస్తున్న పాలకమండలి సభ్యులను మంత్రి అభినందించారు. హిందూ సంప్రదాయంలో గ్రామ దేవతల ఉత్సవాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని, భక్తుల కోరికలను తీర్చే అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రజలు భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే అమ్మవారిని మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కొరిపూరి రాజు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ బొడ్డు బంగారుబాబు, వార్డు కౌన్సిలర్‌ కుండల హరిబాబు, అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, డీఎస్పీ చిలకా వెంకట రామారావు తదితరులు దర్శించుకున్నారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us