UPDATED 29 MARCH 2022 TUESDAY 07:00 PM
● కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) మార్చి 29 : పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన బహిరంగ వేలం పాటల్లో పలు అక్రమాలు జరిగాయని దేవస్థానం మాజీ చైర్మన్ జోకా సీతారామస్వామి (సీతబాబు) కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వేలం పాటలు హెచ్చు పాటకు వెళ్లినా కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా దేవస్థానం ఆదాయానికి ఈవో పులి నారాయణ మూర్తి గండి కొట్టారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అమ్మవారి జాతరలో సమర్పించే కోళ్లు పోగుచేసుకునే హక్కు కోసం టెండర్ రూ.21 లక్షల వరకూ వెళ్లినా కేవలం రూ. 12 లక్షలకు ముగించేశారని, అలాగే చీరలు పోగుచేసుకునే హక్కునకు సంబంధించి రూ.11 లక్షలకు వేలంపాట వెళ్లినా రూ. నాలుగు లక్షలకు వేలం పాటను తగ్గించేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వేలంపాటలో జరిగిన అక్రమాల కారణంగా దేవస్థానం ఆదాయానికి భారీగా గండి పడిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై దేవస్థానం ఈవో పులి నారాయణ మూర్తిని వివరణ కోరేందుకు ఫోన్ లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.