వీణాపాణీ .. చదువుల చక్రపాణి

ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 26 ఆక్టోబర్ 2021: వాడపల్లి వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు సర్వాంతర్యామి వెంకటా చలపతి... వీణాపాణిగా, చదువుల తల్లి సరస్వతీ అవతారంలో దర్శనమిచ్చారు. శ్రీనివాసుడు హంస వాహనరూడుడై వాగ్దేవత సరస్వతీదేవి అలంకారంలో వివేకాన్ని భక్తులకు బోధిస్తున్ననట్లు కనిపించారు. గోవింద నామ స్మరణ నడుమ దేవదేవుడు హంస వాహనం అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. తొలుత విష్వక్సేన పూజ, పంచామృత మండపారాధన, స్నపనం, అష్టదళ పాద పద్మారాధన, దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు పండితులు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యుల నేతృత్వంలో రమణీయంగా జరిగాయి. దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఉమాదేవి దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమా పార్వతి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us