భక్తి శ్రద్దలతో కార్తీక పౌర్ణమి పూజలు

UPDATED 22nd NOVEMBER 2018 THURSDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో గల ఆదిత్య సాంస్కృతిక కళావేదిక వద్ద గురువారం కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేకంగా తయారుచేసిన శివలింగానికి రుద్రాభిషేకాలు, బిల్వపత్రాలతో విశేష అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే ప్రాంగణంలో కొలువై ఉన్న షిరిడీ సాయినాధునికి ప్రత్యేక అభిషేకాలు, నీరాజన మంత్రపుష్పాలతో ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేషారెడ్డి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు, ప్రిన్సిపాల్స్, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us