UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 08:30 AM
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇంటికి వెళ్లనున్నారు. మొన్న సిఐడి అరెస్టు చేసిన అశోక్ బాబుకు విజయవాడ కోర్టు గతరాత్రి బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అయిన అశోక్ బాబు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని బాబు నిర్ణయించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పడమట లంకలోని అశోక్బాబు నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు.