శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో వేసవి క్రికెట్ క్రీడా శిబిరం

UPDATED 28th APRIL 2018 SATURDAY 9:00 PM

పెద్దాపురం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ నందు ఏర్పాటు చేసిన సబ్-సెంటర్లో వేసవి క్రికెట్ క్రీడా శిబిరం శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కె.ఎస్. కిరణ్ రాజు హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని ఈ వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఈ శిబిరం మే నెల 25వ తేదీ వరకు జరుగుతుందన్నారు. అనంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ సి.హెచ్. విజయ్ ప్రకాష్, క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ నాయుడు, జాయింట్ సెక్రటరీ కొండలరావు, సబ్-సెంటర్ ఇంఛార్జ్ ఆవాల లక్ష్మీ నారాయణ, సభ్యులు మురళీకుమార్, కె. విజయ్ కృష్ణ, ఎం. కృష్ణమూర్తి, సీనియర్ రంజీ క్రీడాకారులు ఇజ్రాయిల్ రాజు, సీనియర్ క్రీడాకారులు సరోజ్ వాసు, కుమార్, కోచ్ దుర్గాప్రసాద్, ప్రిన్సిపాల్  నీరా ప్రసాద్, సతీష్, తదితరులు పాల్గొన్నారు,

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us