పే రివిజన్‌కు బదులు పే రివర్స్: ఆనందబాబు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు రెండున్నరేళ్ల తర్వాత పే రివిజన్‌కు బదులు పే రివర్స్‌ను సీఎం అమలు చేస్తున్నారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఉద్యోగులు 71 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచితే.. ప్రభుత్వం 72వ డిమాండ్‌ను అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు నష్టపోవడానికి నాయకత్వ లోపమే కారణమన్నారు. సీఎంను కలవలేని దుస్థితిలో ఉద్యోగ సంఘాల నేతలు ఉండడం దారుణమన్నారు. పీఆర్సీ కమిషన్ నివేదిక చేతికి రాకపోవడం కంటే అవమానం ఉంటుందా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల న్యాయ పోరాటానికి టీడీపీ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. జగన్‌రెడ్డి చేసిన వంచనపై ఉద్యోగులు ఆలోచించాలని ఆయన హితవు పలికారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us