Perni Nani : మోదీని పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడం లేదు : మాజీ మంత్రి పేర్ని నాని

UPDATED 20th JUNE 2022 MONDAY 10:50 AM

Perni nani counter : వైసీపీ ప్రభుత్వంపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం సీఎం జగన్‌ తీసుకొచ్చిన పథకాలు అమలు చేస్తోంటే… పవన్‌కి కనబడటం లేదా అని ప్రశ్నించారు. 2014లో తనను చూసి ఓటేయమన్నారని… టీడీపీ, బీజేపీ తప్పు చేస్తే తాను ప్రశ్నిస్తానని చెప్పారని.. కానీ రైతులకు రుణమాఫీ పేరుతో టీడీపీ అన్నదాతలను దగా చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

ఐదేళ్లలో కేవలం 15వేల కోట్లను మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. పంట పరిహారం, విత్తనాలు పంపిణీ చేయకపోయినా మీరు ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని నిలదీశారు. కౌలు రైతులకు బీజేపీ ఎక్కడైనా సాయపడిందా అని ప్రశ్నించారు. ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్న పవన్‌.. మోదీని ఎందుకు అడగటం లేదో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కపైసా కూడా ఎందుకు తేలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీతో దోస్తీ కట్టి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని నిలదీశారు. ప్రత్యేక హోదా తెచ్చారా? వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ఆపారా అని నిలదీశారు. 2024 ఎన్నికల్లో పవన్‌ ఎవరితో వెళ్తారో తామూ చూస్తామని.. అప్పడు చంద్రబాబు దత్తపుత్రుడు అవుతారో..లేదో తేలుతుందని పేర్ని నాని అన్నారు. బాధ్యత లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని మండిపడ్డారు. ప్రశ్నిస్తానని చెప్పి టీడీపీ, బీజేపీ పంచన చేరారని పేర్ని నాని విమర్శించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us